అఫీషియల్ : "ఉగ్రం" మూవీ "ఓటిటి" విడుదల తేదీ ప్రకటన..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇది వరకే నరేష్ ... విజయ్ కాంబినేషన్ లో నాంది అనే మూవీ రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తో నరేష్ కు విజయ్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది.
 

ఇలా అప్పటికే వీరి కాంబినేషన్ లో నాంది మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించడంతో ఉగ్రం మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆరా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా భారీ మొత్తంలో కలక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్ట లేక పోయింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఉగ్రం మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని జూన్ 2 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: