ఆ స్టార్ హీరో వల్లే ప్రభాస్ కి పెళ్లి కావడం లేదా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్.ఆది పురుష్ సినిమాతో మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ట్రైలర్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి 1 బాహుబలి 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తాడో చూడాలి. అయితే బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా ప్లాపులుగా నిలిచాయి. 

దీంతో ప్రస్తుతం అందరూ ఆదిపురుష్ సినిమా పైనే భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే ప్రభాస్ సినీ కెరియర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నప్పటికీ ఆయన పర్సనల్ జీవితం మాత్రం నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఒక స్టార్ హీరో అని తెలుస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ త్రిషతో ప్రేమలో పడ్డారని వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవాలని అనుకున్నారు అంటూ గతంలో రకరకాల వార్తలు వినిపించాయి.

ఇక ఈ కారణంగానే వీరిద్దరూ జంటగా పౌర్ణమి వర్షం బుజ్జిగాడు వరుస సినిమాల్లో నటించారు. కానీ ఎప్పుడైతే త్రిష తమిళ్ లో విజయ్ సరసన కొన్ని సినిమాల్లో నటించిందో అప్పటినుండి విజయ్ త్రిష మధ్య సీక్రెట్ ఎఫైర్ నచ్చిందని వార్తలు వచ్చాయి.అంతేకాదు విజయ సంగీతకు విడాకులు ఇచ్చి త్రిష ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.ఇక ఈ విషయం కాస్త కోలీవుడ్ మొత్తం వ్యాపించడంతో ఆ వార్త ప్రభాస్ కి కూడా తెలిసింది. దాంతో ప్రభాస్ త్రిష క్యారెక్టర్ మంచిది కాదని ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటూ త్రిషతో బ్రేకప్ చేసుకున్నాడట ప్రభాస్. అలా కోలీవుడ్ హీరో విజయ్ తో త్రిషకి ఉన్న సంబంధం వల్ల ప్రభాస్ త్రిషతో విడిపోయారన్న వార్తలు వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: