యాంకర్ సుమ పరువు తీసిన దగ్గుబాటి హీరో....!!

murali krishna
దగ్గుబాటి రానా నటించిన సినిమాలలో సోలో హీరోగా నటించిన సినిమాల కంటే మల్టీస్టారర్ సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. బాహుబలి సిరీస్ సినిమాలు, భీమ్లా నాయక్ రానా టాలెంట్, క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచాయి.
విరాటపర్వం సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో రానా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరేషాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రానా పరేషాన్ మూవీ నటీనటులతో కలిసి ఈ షోకు హాజరయ్యారు. ప్రోమోలో రానా పేల్చిన పంచ్ లు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హల్క్ అంటూ రానా గురించి సుమ ఇంట్రడక్షన్ ఇవ్వగా స్టైలిష్ గా రానా ఎంట్రీ ఇచ్చారు.
పరేషాన్ మూవీ నటీనటులు తిరువీర్, ప్రణవి కరణం, దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్ కూడా ఈ షోకు హాజరయ్యారు. స్కూల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని సుమ అడగగా యూనిఫామ్, ప్రిన్సిపాల్, ఎగ్జామ్స్, బ్లాక్ బోర్డ్, బుక్స్, ప్లే గ్రౌండ్ అని రానా చెప్పగా ప్లే గ్రౌండ్ జవాబు తప్పు కావడంతో రానా మిగతా జవాబులు చెప్పే అవకాశం కోల్పోయాడు. ఆ తర్వాత ఈ స్కూల్ మా స్కూల్ కాదని రానా కామెంట్లు చేశారు. ఈ రౌండ్ బజర్ రౌండ్ అని సుమ చెప్పగా వెంటనే రానా బజర్ ప్రెస్ చేసి వినిపిస్తుందా మీకు అని సుమను అడిగారు.
సుమ వెంటనే ఎందుకండీ నా చెవులు పని చేయవని అనుకున్నారా అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత సుమ ఒక ఫోటో చూపించగా వెంకటేశ్ అని రానా అన్నారు. డౌటొచ్చి టక్కున చెప్పానని కాకపోతే కట్ చేసేయండి కావాలంటే షోలో మాకు ఇచ్చిన డబ్బులు ఇస్తానని రానా కామెంట్ చేశారు. ఆ తర్వాత రానా ఏం జరిగింది దేవసేన అని సుమను అడగగా నేను బిర్యానీ పొట్లం కోసం లైన్ లో నిలబడి ఉంటే తిరువీర్ నా చెయ్యి లాగాడని చెప్పింది. రానా వెంటనే దానికి నువ్వేం చేశావ్ అని అడగగా నేను అతని వేలు నరికేశానని సుమ చెప్పగా రానా వెంటనే నరకాల్సింది వేలు కాదు నీ బిర్యానీ పాకెట్ అని పంచ్ వేశారు.
ఆ తర్వాత ఎవరితో స్నేహం ఎక్కువకాలం ఉంటుందని సుమ అడగగా చిన్ననాటి స్నేహితులతో అని సమాధానం చెప్పి ప్రణవి రెండు లక్షలు బెట్ పెట్టగా ఆ సమాధానం రైట్ కాదని 500 రూపాయలు పెడతానని రానా తెలిపారు. ఇప్పటివరకు ఈ షోలో 500 ఎవరూ ఇవ్వలేదని పట్టుకోవడానికి కూడా నామోషీగా ఉందని సుమ చెప్పగా ఇక్కడ పెట్టండి అయితే అంటూ రానా మరో పంచ్ వేశారు. కొంచెం పెట్టండి అని సుమ పంచ్ వేయగా 500కు చిల్లర ఉందా అని రానా అడిగారు. సుమపై రానా వేసిన పంచ్ లు భలే పేలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: