"మేము ఫేమస్" మూవీకి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుమంత్ ప్రభాస్ ఒకరు. ఈయన యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని తాజాగా మేము ఫేమస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ద్వారా ఈ యువ నటుడు హీరోగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో ఈ యువ నటుడు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఈ మూవీ నుండి ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను భాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూడు రోజుల్లో ఈ సినిమా నైజాం ఏరియాలో 1.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , ఏపీ మరియు సీడెడ్ ఏరియాలో 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 1.21 కోట్ల షేర్ ... 2.41 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రిమైనింగ్ ప్రాంతాల్లో ఈ మూవీ 3 రోజుల్లో 66 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1.52 కోట్ల షేర్ ... 3.07 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 2.20 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ మూవీ మరో 68 లక్షల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: