Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే.. బన్నీ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్!

Amruth kumar
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి గ్లోబల్ స్థాయిలో మారుమోగిపోతోంది. ‘గంగోత్రి’తో మొదలైన ఆయన ప్రయాణం, ‘పుష్ప’తో ప్రపంచాన్ని షేక్ చేసే స్థాయికి చేరింది. నేడు (ఏప్రిల్ 8) ఐకాన్ స్టార్ 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటి వద్ద, సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. అటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వంటి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంటే, ఇటు ఫ్యాన్స్ బాక్సాఫీస్ రికార్డులను వేటాడటానికి సిద్ధమయ్యారు.



అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఆయన బంగళా వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వేల సంఖ్యలో అభిమానులు బన్నీని చూడటానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. టపాసులు కాల్చుతూ, కేకులు కట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొందరు అభిమానులు ‘పుష్పరాజ్’ గెటప్‌లో వచ్చి సందడి చేయడం విశేషం.తమ అభిమాన నటుడు క్షేమంగా ఉండాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బన్నీ ఇంటి ముందు జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.


అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోయే AA22 చిత్రానికి ‘రాకా’ (RAAKA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.ఈ టైటిల్ పోస్టర్‌లో బన్నీ లుక్ మునుపెన్నడూ చూడని విధంగా ‘వైల్డ్’గా ఉంది. షేవ్ చేసిన తల, దట్టమైన గడ్డం, కళ్ళల్లో తీవ్రమైన కోపం.. అన్నీ కలిసి ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోందని హింట్ ఇస్తున్నాయి.ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ మల్టిపుల్ రోల్స్‌లో కనిపించబోతున్నారని సమాచారం.ఏప్రిల్ 8 ఉదయం 11 గంటలకు విడుదలైన ఈ పోస్టర్ కొన్ని నిమిషాల్లోనే లక్షలాది లైక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: