పెళ్లి తరువాత పూర్తిగా రూట్ మార్చిన విజయ్ దేవరకొండ..ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడా..?
ఇదిలా ఉండగా, ‘రణబాలి’ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన తొలి చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్ ఇటీవల విజయ్ను కలిసి ఓ కొత్త కథను వినిపించినట్లు సమాచారం. ఆ కథ విజయ్‌కు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.‘టూరిస్ట్ ఫ్యామిలీ’ విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషన్ జీవింత్, ఈసారి విజయ్ దేవరకొండతో కలిసి మరింత ఆసక్తికరమైన కథను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వెలువడితే ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత రానుంది.
మొత్తానికి, ఒకవైపు ‘రణబాలి’తో బిజీగా ఉండడంతో పాటు మరో కొత్త సినిమాను కూడా లైన్లో పెట్టడం ద్వారా విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన అభిమానులు ఈ రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మంచి హిట్ కొడతారు అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రష్మిక కూడా ఈ సినిమాలో నటిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.