పవన్ కళ్యాణ్ ఫుడ్ సీక్రెట్స్ బయటపెట్టిన అన్నా లెజినోవా!
తక్కువ కాలంలోనే నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న అన్నా లెజినోవా, తాజాగా అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో "పూనకాలు" తెప్పిస్తోంది.పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలు.
అత్తమ్మ శిష్యురాలిగా అన్నా లెజినోవా..
విదేశీయురాలు అయినప్పటికీ మెగా కుటుంబపు సంప్రదాయాలను, అలవాట్లను అన్నా లెజినోవా పుణికిపుచ్చుకున్నారు. నెటిజన్లు అడిగిన ‘మీకు వంటలు చేయడం వచ్చా?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. "నేను మా అత్తమ్మ (పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి గారు) దగ్గర వంటలు నేర్చుకున్నాను. దోస, ఇడ్లీ, చట్నీ వంటి సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లతో పాటు రకరకాల కర్రీలు, పప్పులు చేయడం నేర్చుకున్నాను" అని అన్నా తెలిపారు. కేవలం వెజ్ మాత్రమే కాదు.. ఫిష్ పులుసు, గోంగూర, పాలక్ పన్నీర్, ప్రాన్స్ ఇగురు, బిర్యానీ వంటి వంటకాలను కూడా ఆమె నేర్చుకున్నారట. ముఖ్యంగా అత్తమ్మ దగ్గర నేర్చుకున్న వెజ్ వంటలంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ‘ఫేవరెట్’ మెనూ..
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రశ్న.. పవర్ స్టార్‌కు ఏ ఫుడ్ అంటే ఇష్టం? దీనిపై అన్నా లెజినోవా ‘హై-వోల్టేజ్’ క్లారిటీ ఇచ్చారు. "పవన్ కళ్యాణ్ గారికి మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే ప్రాణం. ఆమె దగ్గర నుంచే నేను ఆ వంటకాన్ని స్పెషల్‌గా నేర్చుకున్నాను" అని అన్నా చెప్పుకొచ్చారు.మెగా కుటుంబంలో ఉన్న బాండింగ్ గురించి చెబుతూ.. "ఆయనకు తన వదినమ్మ (సురేఖ కొణిదెల గారు) చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం" అని రివీల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో జరిగే విందుల్లో పవన్ ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారని ఆమె పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ‘అన్నాలెజినోవా’ సందడి.. మెగా ఫ్యాన్స్ ఖుషీ!
అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన అరుదైన ఫోటోలు, అప్‌డేట్స్ షేర్ చేస్తున్నారు.రీసెంట్‌గా నిహారిక కొణిదెల ‘రాక్షస’ సక్సెస్ మీట్, అల్లు అర్జున్ ‘రాకా’ టైటిల్ అనౌన్స్‌మెంట్, రామ్ చరణ్ ‘పెద్ది’ అప్‌డేట్స్ నేపథ్యంలో అన్నా లెజినోవా చేస్తున్న ఈ చిట్ చాట్ మెగా అభిమానులకు ‘డబుల్ ధమాకా’ ఇస్తోంది. డిప్యూటీ సీఎం భార్య అయినప్పటికీ, చాలా సాధారణంగా అభిమానులతో ముచ్చటిస్తూ వంటల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఆమె చెబుతున్న తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.