స్టేజ్ పైనే మృణాల్ ఠాకూర్ కు సారీ చెప్పిన స్టార్ హీరో..!

Divya
టాలీవుడ్లో యంగ్ హీరోలలో అడవి శేష్ ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలతో అలరిస్తుంటారు. హిట్ 2 సినిమా తర్వాత నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఉండబోతోంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో డైరెక్టర్ షానియల్ డీయో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బీమ్స్ సిసిలిరోలియో సంగీతాన్ని అందిస్తూ ఉండగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను మరింత పెంచేశాయి.



ఈ క్రమంలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర బృందం నిర్వహించగా ఈ వేడుకకు వెంకటేష్ తోపాటు సిద్దు జొన్నలగడ్డ ,హీరో సుమంత్ మరికొంతమంది ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ క్రమంలోనే హీరో సుమంత్ మాట్లాడుతూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు క్షమాపణలు తెలియజేయడం జరిగింది. క్షమించు.. మృణాల్ నీ దగ్గర నుంచి నీ రాముని తీసుకెళ్లిపోయినందుకు నిజానికి సీతారామం సినిమాలో ఒక సీన్ ఉన్నది. కానీ ఎడిటింగ్లో తప్పని పరిస్థితుల్లో దానిని తీసేయాల్సివచ్చిందని, అందుకు బదులుగా నేను మా సిస్టర్ నిర్మాతలుగా నీకు డేకాయిట్ ఇచ్చాము. ఈ చిత్రం కూడా నీ కెరియర్లో ఒక మైలురాయిగా నిలుస్తుంది అంటూ తెలియజేశారు. ప్రస్తుతం హీరో సుమంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.


గతంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వచ్చిన సీతారామం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో సుమంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ క్రేజ్ పెరిగిపోయింది. అలా ఎన్నో చిత్రాలలో నటించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు డెకాయిట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: