రూ.1000 కోట్ల మార్క్ ను ఈ చిత్రాలు అందుకోగలవా..!!

Divya
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పఠాన్ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ .1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ప్రతి ఏడాది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రూ .1000 కోట్లు కలెక్షన్ చేసే ప్రాజెక్టు ఏదో ఒకటి వస్తూ ఉండడం గమనార్హం.2011 లో కేజీఎఫ్ -2 సినిమా రాగ 2022 లో rrr చిత్రం ఆ మార్కు అందుకోవడం జరిగింది.. ఈ ఏడాది పఠాన్ సినిమాతో వెయ్యికోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది. ఈ చిత్రం ఓవరాల్గా రూ.1050 కోట్ల రూపాయల గ్రాస్ ను అందుకుంది.
అయితే ఏడాది పాన్ ఇండియా లెవెల్లో విడుదల కి ఎక్కువగానే సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఒకటి రెండు సినిమాలు కూడా ఈ  రూ.1,000 కోట్ల గ్రాస్ వసూల్ని దాటే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వాటిలో ముందు ఉన్న సినిమా ఆది పురుష్.. ఈ సినిమా జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది భారీ స్క్రీన్స్ పై ఈ సినిమాని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది గడిచిన కొద్ది రోజుల క్రితం ట్రైలర్ ని విడుదల చేయక ఒకసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఆ తర్వాత డైరెక్టర్ అట్లీ, షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం జవాన్ ఈ సినిమా హిందీ, తమిళ్, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు ఈ సినిమా పైన కూడా హై ఎక్స్పరిషన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో రూ  1000 కోట్ల మార్పుని అందుకుంటుందని చిత్ర బృందం అంచనా వేస్తున్నారు. ఇక ఆ తర్వాత ప్రభాస్, ప్రశాంతి నీళ్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా కూడా ఇదే స్థాయిల రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర బృందం చాలా ధీమాతో ఉన్నారు. అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్-3, తదితర సినిమాల పైన అంచనాలు ఉన్నాయి. మరి ఏ సినిమా రూ .1000 కోట్ల పైన క్రాస్ రాపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: