పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేస్తున్నది ఆమేనా..?

Divya
అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా నార్త్ లో ఎటువంటి ప్రమోషన్స్ చేపట్టకపోయినా సరే నార్త్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ లభించి.. అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరో అయిపోయిన ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇకపోతే పుష్ప సినిమా వచ్చిన తర్వాత చాలామంది ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూశారు ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమాను త్వరలోనే మన ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం శతవిధాల ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగు ఒడిస్సా అడవుల్లో వేగంగా కంప్లీట్ అవుతున్నట్లు సమాచారం.  మరొకవైపు ఈ సినిమాలో రష్మిక మందన్న డి గ్లామరస్ పాత్ర పోషిస్తున్నారు.. ఇకపోతే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో సమంత నటించిన మెప్పించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు పుష్ప 2 లో కూడా సమంత నటిస్తుంది అంటూ వార్తలు బాగా వినిపించాయి కానీ ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటూ విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో బిజీగా ఉండడం వల్లే ఆమె ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఒక హీరోయిన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సరికొత్త అనుమానాలకు దారితీస్తోంది. రన్ రాజా రన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సీరత్ కపూర్ గురించి  ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని చిత్రాలలో నటించిన సరైన హిట్టు కోసం ఇంకా ఎదురుచూస్తోంది అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా అల్లు అర్జున్ ని హగ్ చేసుకున్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకోవడం తో పాటూ  .. ఎదగాలంటే డాన్సర్లకు రెక్కలు అవసరం లేదు అయితే అది తెలుసుకున్న రోజు వారికి వారి ఎనర్జీ దారి చూపిస్తుంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఈమె పుష్ప 2లో  ఐటెం సాంగ్ చేస్తోందని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: