రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న రెడీ చిత్రం..!!

Divya

టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరియర్ ప్రారంభంలో చాక్లెట్ బాయి గా పేరు సంపాదించుకున్నారు .ఆ తర్వాత మాస్ హీరోగా కూడా పేరు సంపాదించారు. హీరో రామ్ అప్పట్లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో బాగా నటించి బాగానే సక్సెస్ అయ్యారు. అలా సక్సెస్ అయిన చిత్రాలలో రెడీ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం రీ రిలీజ్  హవా ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతూనే వస్తోంది.

స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారీ  కెరియర్లో బ్లాక్ బాస్టర్ చిత్రాలను కూడా విడుదల చేస్తూ ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే రామ్ పోతినేని అభిమానులకు కూడా ఒక గుడ్ న్యూస్ను అందించడం జరిగింది. ఈనెల 15వ తేదీన రామ్ బర్తడే సందర్భంగా READY చిత్రాన్ని రీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కూడా 4K క్వాలిటీతో థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది దీంతో హీరో రామ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని 2008లో శ్రీను వైట్ల  దర్శకత్వంలో తెరకెక్కించారు ఇందులో హీరోయిన్గా జెనీలియా నటించింది.

రామ్ కెరియర్ లోని ఈ సినిమా బెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం పలు భాషలలో కూడా రీమిక్ అయ్యి సక్సెస్ను అందుకుంది. ఇప్పుడు మళ్లీ థియేటర్లోకి రాబోతూ ఉండడంతో అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.మాస్ అండ్ యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కువగా ఇష్టపడే రామ్ పోతినేని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నారు ఈ సినిమా కూడా మాస్ సినిమాగా ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: