రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేహా శర్మ కేవలం నటి మాత్రమే కాదు ఈమె ఒక మోడల్. ఇకపోతే 2007లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది ఈమె. దాని అనంతరం కుర్రాడు అనే సినిమాలో సైతం నటించింది నేహా శర్మ . తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది నేహా శర్మ.ఈ సినిమాలో తన అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా అనంతరం తిరిగి నేహా శర్మ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయ్యింది. అయితే తాజాగా ఈమె నటించిన జోగిరా సారా రారా అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మే 12న భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్ధితో నేహా శర్మ ప్రేమలో ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా కూడా కూస్తోంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళుతున్నారట. అంతేకాదు చాలాకాలంగా వీరిద్దరూ కలిసి బయట కూడా తిరుగుతున్నారట.
ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ భావిస్తున్నారు. వీరిద్దరి ప్రేమ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తపై ఇప్పటిదాకా స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరిద్దరూ ప్రేమలో ఉండడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారన్న వార్తలు సైతం సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై నేహా శర్మ కానీ నవాజుద్దీన్ సిద్ది కానీ స్పందించేంతవరకు ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు. చూడాలి మరి ఈ విషయంపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో..!!