అమెరికాలో జాబ్.. హీరోయిన్ లయ జీతం ఎంతో తెలుసా?

praveen
స్వయంవరం అనే సినిమా తో తెలుగు తెరకు హీరోయిన్ల పరిచయమైన లయ తన అందం అభినయం తో ఎంతలా ప్రేక్షకులను కట్టిపడేసిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగింటి ఆడపడుచు అంటే ఎలా ఉండాలో ఇక సినిమాల్లో లయను చూసిన తర్వాత ఎంతో మంది వర్ణించడం మొదలు పెట్టారు అని చెప్పాలి. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు అందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 అయితే కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే అమెరికాలో స్థిరపడ్డ గణేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం లయ కుటుంబంతో సహా అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు లయ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఈ హీరోయిన్ భర్త వృత్తి రిత్యా ఒక డాక్టర్. ఇక ఆయనకంటూ ప్రత్యేకమైన మూడు హాస్పిటల్స్ ఉన్నాయట. ఇక ఆమె ఫ్యామిలీకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి అన్నది తెలుస్తుంది.

 అయితే ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ అటు లయ మాత్రం ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడం లేదట. ఏకంగా అమెరికాలో ఒక ఉద్యోగం చేస్తుంది అన్నది తెలుస్తుంది. వ్యక్తిగత కారణాలతో అటు సినిమాలకు మాత్రమే కాదు జాబ్ కి కూడా గ్యాప్ తీసుకున్న లయ.. ఇక ఇప్పుడు మళ్లీ కొత్త జాబ్ లో జాయిన్ అయ్యిందట. లయ పనిచేస్తున్న సంస్థ పేరు జోబి ఏవియేషన్. ఎయిర్ బస్ సంస్థలో లయ కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారట. ఎంప్లాయ్ గా ఉన్న లయ ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అంతేకాదు లయ నెలకు 10 లక్షల రూపాయల జీతం అందుకుంటుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: