ఆ సినీ రాజకీయవేత్తతో ఎఫైర్ పెట్టుకున్న నయనతార?

Purushottham Vinay
సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు లవ్, డేటింగ్, బ్రేకప్ లాంటివి సర్వ సాధారణం అని చెప్పాలి. ప్రతి ఒక్కరి లైఫ్ వెనక ఏదో ఒక బ్రేకప్ స్టోరీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.ఇక కొందరు నటీనటులు తమ బ్రేకప్ గురించి బయట పెడితే మరి కొంతమంది సీక్రెట్ గా ఉంచుతూ ఉంటారు. ఇక వీళ్ళ లైఫ్ లో ఇవన్నీ చాలా కామన్ అని జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు.ఒకరితో బ్రేకప్ అయ్యాక కూడా వెంటనే మరొకరిని లైన్లో పెట్టేస్తూ ఉంటారు. అసలు గ్యాప్ అనేది ఇవ్వకుండా ఒకరి తర్వాత ఒకరితో డేటింగ్ చేస్తుంటారు. ఇక అందులో తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ముందు వరుసలో వుంది అని చెప్పాలి.నయన్ నటిగా ఎంత పేరు తెచ్చుకుందో వ్యక్తిగతంగా అంత హాట్ టాపిక్ గా నిలిచింది. అప్పట్లో ఈమె ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్ లు మామూలుగా ఉండేవి కావు.ఏకంగా బాయ్ ఫ్రెండ్ తో ముద్దు పెట్టుకున్న ఫోటోలు  మీడియాల ద్వారా బయటపడ్డాయి.


కెరీర్ మొదట్లోనే తమిళ స్టార్ హీరో శింబుతో బాగా రచ్చ రచ్చ చేసింది నయనతార. ఏకంగా అతనితో ముద్దులు పెట్టుకున్న ఫోటోలు బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి. ఇక వీరు పెళ్లి చేసుకుంటారని అప్పట్లో చాలా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ తరువాత వీరు విడిపోయారు. అంతటితో ఆగకుండా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో కూడా ప్రేమ వ్యవహారం నడిపించింది. అప్పటికే ఆయనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ  పెళ్లికి కూడా రెడీ అయింది. కానీ ఆయనతో కూడా బ్రేకప్ చెప్పుకుంది ఈ హాట్ బ్యూటీ. ఇక వీరిద్దరి తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేసి అతన్ని పెళ్లి చేసుకుంది.ఇక ప్రభుదేవా తర్వాత ఒక మంత్రి తో కూడా ప్రేమాయణం నడిపింది. ఇక ఆ మంత్రి ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిది స్టాలిన్. ఈయనతో కూడా కొంతకాలం ఎఫైర్ నడిపిందని రీసెంట్ గా బీజేపీ నేత ధారారవి బయట పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: