ఈవారం ఓటీటీ .. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే..!

Divya
ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు సిద్ధమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అటు ఓటీటీలు , థియేటర్లు కూడా ముస్తాబ్ అవుతున్న విషయం తెలిసిందే. మరి ఈ వారం అటు ఓటీటీ లు, ఇటు థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
విరూపాక్ష:
కొత్త దర్శకుడు కార్తీక్ తండ్రి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా,  సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన చిత్రం విరూపాక్ష.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా పై ఊహించని విధంగా అంచనాలు పెంచేసాయి.  ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది..
హలో.. మీరా!
గార్గేయి ఎల్లా ప్రగడ ప్రధాన పాత్ర లో వస్తున్న సినిమా హలో మీరా.. ఒకే ఒక్క క్యారెక్టర్ తో వస్తున్న ఈ సినిమాకి కాకర్ల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు సక్సెస్ డ్రామా గా థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ చిత్రంలో మీరా అనే పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.  ఇక ఈ సినిమా కూడా ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ కాబోతోంది.
ఇక ఈ వారం ఓటీటీ లో వచ్చే చిత్రాల విషయానికి వస్తే..
సోనీ లివ్: గర్మీ .. సీరీస్.. ఏప్రిల్ 21
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : సుగా ఏప్రిల్ 21
నెట్ ఫ్లిక్స్ : హౌ టు గెట్ రిచ్.. ఇంగ్లీష్ ఏప్రిల్ 18
ది మార్క్డ్ హార్ట్.. సీజన్ 2 ఏప్రిల్ 19
చోట బీమ్ సీజన్ 17.. ఏప్రిల్ 20
టూత్ పరి.. హిందీ ఏప్రిల్ 20
రెడీ తెలుగు ఏప్రిల్ 21
సత్య 2 తెలుగు ఏప్రిల్ 21
వీటితోపాటు మరికొన్ని చిత్రాలు నెట్ఫ్లిక్స్ లో విడుదల కానున్నాను. ఏది ఏమైనా ఈ వారం అటు సినిమా ప్రియులకు.. ఇటు సీరీస్ ప్రియులకు మంచి సమయమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: