'బాలు' మూవీ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజే వేరు. హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫాన్స్ కి పండగే. పవన్ తో పాటూ సినిమాలో నటించే నటీనటులకు కూడా అంతే గుర్తింపు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్తో నటించిన హీరోయిన్స్ కొందరు ఇతర సినిమాల్లో ఆఫర్స్ అందుకొని స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. మరి కొంతమంది వేరే రంగాల్లో సెటిలైపోయారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి 'బాలు' సినిమాలో హీరోయిన్గా నటించిన నేహా ఒబెరాయ్ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. సినిమాలో ఈ ముద్దుగుమ్మ కనిపించింది కాసేపే అయినా తన అందం, అమాయకపు నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.

 

నేహా ఒబెరాయ్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. బాలీవుడ్ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కూతురే ఈ నేహా ఒబెరాయ్. నిజానికి బాలీవుడ్ పై ఆమెకు మంచి అవగాహన ఉన్నా.. బాలు సినిమాతోనే ఆమె తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే బాలు మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీలో 'వుడ్ స్టాక్ విల్లా' అనే సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా యావరేజ్ గా సరిపెట్టుకున్న సినిమాల్ నేహా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ తెలుగులో జగపతిబాబు సరసన బ్రహ్మాస్త్రం సినిమాలో నటించింది. ఈ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు నేహా.

 

కానీ తెలుగులో ఈ హీరోయిన్ కి అభిమానులు బాగానే ఉన్నారు. బాలు సినిమాలో ఈమె అమాయకపు నటనకు ప్రేక్షకుల ఫీదా అయ్యారు. ఈ సినిమాలో నేహా ఒబేరాయ్ తో పాటు శ్రీయా కూడా మరో హీరోయిన్గా నటించినా.. ఎక్కువ గుర్తింపు మాత్రం నేహా ఒబెరాయికి వచ్చింది. అలా అప్పట్లో తన అమాయకపు నటనతో ఆకట్టుకున్న నేహా ఒబెరాయ్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అప్పటికంటే ఇప్పుడే ఇంకా గ్లామరస్ గా ఉంది ఈ హీరోయిన్. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పిక్స్ చూసిన పవన్ ఫ్యాన్స్ అయితే అప్పటికి, ఇప్పటికీ ఈ హీరోయిన్ తన అందంతో అలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: