వారిని చూస్తుంటే ఆగలేకపోతున్న : విష్ణుప్రియ

murali krishna
తెలుగు లో హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ కూడా ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో  బాగా పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో కూడా యువతకు గాలం వేస్తోంది.. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ అందరిని మెప్పించింది విష్ణుప్రియ.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ పలు అంశాలపై కామెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ట్రోలింగ్ కి కూడా ఆమె గురవుతూ ఉంటుంది. మొన్నటివరకు టివి షోలతో బిజీగా గడిపిన విష్ణుప్రియ ఇప్పుడు డ్యాన్స్ అండ్ మ్యూజిక్ విడియోలపై దృష్టి పెట్టిందనీ తెలుస్తుంది..
 
తాజాగా విష్ణుప్రియ బోల్డ్ కామెంట్ తో హాట్ టాపిక్ గా అయితే నిలిచింది. బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్ మరియు అలియా భట్ లేటెస్ట్ వీడియో వైరల్ కాగా దానిని విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. అలియా, రణబీర్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటై ఏడాది అయితే గడిచింది. దీనితో వీరిద్దరూ పార్టీలో పాల్గొన్నారట..
 
తిరిగి వస్తుండగా వీరి కారుని అభిమానులు చుట్టుముట్టారట.. బయట ఉన్న ఫ్యాన్స్ అందరికి రణబీర్ కపూర్ కరచాలనం ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. ఇంతలో అలియా భట్ తన భర్తని ప్రేమగా ముద్దు పెట్టుకుందట.ఈ దృశ్యాలు నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తున్నాయనీ తెలుస్తుంది.
 
అలియా భట్ ముద్దుపై విష్ణు ప్రియ స్పందిస్తూ.. 'దేవుడా ఇలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకెప్పుడు ఇస్తావు అంటూ విరహంతో బోల్డ్ గా కామెంట్స్ చేసిందట.. మరీ అంత విరహం తట్టుకోలేకపోతే పెళ్లి చేసుకో అని నెటిజన్లు విష్ణుప్రియకి కామెంట్ చేస్తున్నారట.విష్ణుప్రియ తరచుగా తన పెళ్లి గురించి కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తన భర్త ఎక్కడ ఉన్నాడో ఎలాంటి వాడో అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తుండేది. ఇప్పుడు ఏకంగా ముద్దు పెట్టుకోవాలనే కోరికని కూడా బయట పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: