దృశ్యం సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో....!!
తెలుగులో, తమిళ్ లో, కన్నడలో కూడా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ఒకదాన్ని మించి ఒకటి కథ మూలాన్ని చెడగొట్టకుండా తీసి ప్రేక్షకులను అలరించారు. అయితే హిందీలో అజయ్ దేవగన్ చేసి కాస్త ఈ చిత్ర ప్రాధాన్యత ఒక మెట్టు తగ్గించాడనే చెప్పవచ్చు. దృశ్యం సినిమా మలయాళం లో మోహన్ లాల్ హీరోగా చేయగా తెలుగులో వెంకటేష్ నటించాడు. ఇదే సినిమాని తమిళ్ లో కమల్ హాసన్ తో తీయగా కన్నడలో రవిచంద్రన్ హీరోగా నటించారు.
ఇలా అనేక పాటలుగా వస్తున్న ఈ సినిమాకి అంతకంతకు పెరుగుతున్న ప్రేక్షకుల కోరిక మేరకు సీక్వెల్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. గా మొదట ఈ సినిమా మలయాళం లో తీసిన జీతూ జోసెఫ్ హీరోగా మోహన్ లాల్ కాకుండా మమ్ముట్టిని సంప్రదించాడట. అయితే మమ్ముట్టికి ఆ టైంలో డేట్స్ ప్రాబ్లం రావడంతో చివరి నిమిషంలో సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో ఇది మోహన్ లాల్ కాంపౌండ్ లోకి వెళ్ళింది. ఈ సినిమాకి వచ్చిన ఆదరణ కొద్ది మిగతా భాషల్లో రీమేక్ చేస్తూ వస్తున్నారు. అయితే మమ్ముట్టి మాత్రం ఇప్పటికి దృశ్యం సినిమా చేయనందుకు చాలా బాధపడుతున్నాడట. మలయాళం లో మెగాస్టార్ గా పేరుగాంచిన మమ్ముట్టి ఇంత మంచి సినిమాని వదిలేసుకోవడం నిజంగా పెద్ద విషయమే. ఇక మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే మలయాళంలో దృశ్యం అనే పేరుతో మొదలవగా ఆ తర్వాత అన్ని భాషల్లో కూడా అదే పేరుతో ఈ సినిమాని తీస్తూ వస్తున్నారు. తెలుగులో చాలాసార్లు క్లాసిక్ సినిమా టైటిల్స్ ని కాపీ కొట్టి వాటి పేరుని చెడగొట్టారు మన తెలుగు నిర్మాతలు దర్శకులు కానీ ఈ చిత్రం మాత్రం అలా జరగలేదు. వెంకటేష్ దృశ్యం సినిమా తీస్తున్నాడు అని తెలియగానే చాలా మంది సంతోష పడ్డారు. ఇక రెండు పార్ట్ లు విజయవంతం కాగా మూడవ పార్ట్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కానీ అది పట్టాలు ఎక్కడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటించే నటీనటులు కూడా ఎవరి పాత్ర మేరకు వారు బాగా నటిస్తూ వస్తున్నారు. ఇక పార్ట్-3 ఎప్పుడు ఉంటుందో మరి వేస్ట్ చూడాలి.