కబ్జా -2 విషయంలో తగ్గేదేలే..!!

Divya
కన్నడ నుంచి ఈ మధ్యకాలంలో విడుదలైన పాన్ ఇండియా చిత్రాలలో కబ్జా సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రంలో హీరోగా ఉపేంద్ర నటించిన పోలి ఉండడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా పైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కబ్జా సినిమా ఉపేంద్ర కెరియర్ లోనే డిజాస్టర్ గా మిగిలింది ఇక ఇందులో సుదీప్, శివరాజ్ కుమార్లు ఉన్నప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

ఈ సినిమా చూసిన అభిమానులు సైతం ఒక్కొక్కరు ఒక విధంగా కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ సినిమా సీక్వెల్ ఉండదని అనుకున్నారు కానీ ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ తో షాక్ ఇస్తోంది చిత్ర బృందం. కబ్జా సినిమా సీక్వెల్ వస్తోంది అంటూ అఫీషియల్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. కబ్జా మొదటి భాగాన్ని కన్నడలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్ల పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేకపోయాయి.

దీంతో ఇలాంటి సినిమాకి సీక్వెల్ అంటూ పోస్టర్తో షాక్ ఇష్వడంతో అభిమానులు ఆనందపడాల శాఖ వాళ్ళ తెలియక సతమతమవుతున్నారు. కబ్జా-1 సినిమా ఏ మాత్రం వర్కౌట్ కాకపోయినా కబ్జా-2 సినిమా అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి మరి కబ్జా సినిమాపై సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి.. కే జి ఎఫ్ సినిమా అని మళ్లీ తీశారంటూ కూడా పలువురు ఆడియన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.. మరి పార్ట్ -2 విషయంలోనైనా సరే మార్పులు చేసి కాస్త బెటర్ గా అనిపించుకుంటారేమో చూడాలి. ఏది ఏమైనా మొదటి భాగం సక్సెస్ కాలేకపోయినా రెండవ భాగం సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: