చాలా గ్యాప్ తర్వాత సుప్రీం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా విరూపాక్ష. ఆక్సిడెంట్ తరువాత అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి మరింత ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.కొత్త డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు యంగ్ హీరో సాయి తేజ్. పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు రెడీ అయింది విరూపాక్ష మూవీ.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్.. విరూపాక్ష మూవీలోని మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు.ఇక ఈ వీడియోలో రిస్కీ సీక్వెన్స్ చేస్తూ కనిపించారు సాయి ధరమ్ తేజ్. ఇందులో స్పీడ్ గా బైక్ నడుపుతూ కనిపించారు సాయి తేజ్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అయింది. టీజర్, గ్లింప్స్ లతో అయితే సినిమాపై సాలిడ్ బజ్ అనేది క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా విరూపాక్ష ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమాపై ఉన్న అంచనాలని రెట్టింపు చేశారు.
మొత్తం రెండు నిమిషాల 5 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మూవీ ట్రైలర్.. థ్రిల్, మిస్టరీ అంశాలతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ ఫారెస్ట్ ఏరియాకు 15 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన మహిళ, ఆ తర్వాత వరుసగా హత్యలు.. ఆ చావులకు కారణం తెలుసుకునేందుకు విరూపాక్షగా సాయి ధరమ్ ఏం చేశారు అనేది ఈ చిత్రం కథాంశం అని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా అనే డైలాగ్ ట్రైలర్ లో చాలా బాగా హైలైట్ అయింది.మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా.. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ని అందించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 21 వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై సాయి తేజ్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. వెండితెరపై సాయి తేజ్‌ని చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.