ఆ స్టార్ హీరోతో ఒక్కసారైనా నటించాలని ఉందంటున్న మేఘా ఆకాష్..?

Anilkumar
టాలీవుడ్ లో నితిన్ హీరోగా నటించిన 'లై' అనే సినిమాతో తెలుగు వెండితెర కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మేఘ ఆకాష్. తొలి సినిమా తోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదల అయినా లై మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత మళ్లీ నితిన్ తో కలిసి చల్ మోహన్ రంగా, అలాగే రాజరాజ చోరా, డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలేవి మేఘ ఆకాష్ కు సక్సెస్ను అందించలేకపోయాయి. తెలుగుతోపాటు అటు హిందీ, తమిళ భాషల్లోనూ ఈ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురయింది. 

ఈ క్రమంలోనే టాలీవుడ్లో అడపా దడపా సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. స్వామి రారా చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా (ఈరోజు) ఏప్రిల్ 7న గ్రాండ్ గా విడుదలైంది. ఇక ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒక హీరోయిన్గా మేఘా ఆకాష్ నటించింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఐదుగురు హీరోయిన్లలో ఏ ఒక్క హీరోయిన్ పాత్రకి కూడా సినిమాలో ప్రాధాన్యత లేదట. ఇక ఈ విషయం కాస్త పక్కన పెడితే..

రావణాసుర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మేఘ ఆకాష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా తన మనసులో ఉన్న పెద్ద కోరికను బయట పెట్టేసింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడం.' నాకు అతిగా ఆశించడం నచ్చదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక్కసారైనా వర్క్ చేయాలని ఉంది. అది నా డ్రీమ్. ఆ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి' అంటూ తన మనసులో కోరికను బయటపెట్టింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పవర్ స్టార్ తో వర్క్ చేసే ఛాన్స్ మీకు ఖచ్చితంగా వస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక షూటింగ్ లేని సమయంలో ఏమాత్రం విరామం దొరికినా ఆ టైం మొత్తాన్ని తన ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తానని చెప్పుకొచ్చింది మేఘ ఆకాష్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: