అల్లు అర్జున్ సినిమా విడుదల చేసి తప్పు చేస్తున్నారా..?

frame అల్లు అర్జున్ సినిమా విడుదల చేసి తప్పు చేస్తున్నారా..?

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప -2 సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఎందులో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది తాజాగా నిన్నటి రోజున ఒక చిన్న ప్రోమోతో చిత్ర బృందం ఈ సినిమాకి మరింత బజ్ ను ఏర్పరిచింది..


ఈ సినిమా రూ .1000 కోట్ల టార్గెట్ తో విడుదల కాబోతోంది. ఇదంతా ఇలా ఉంటే గత కొంతకాలంగా టాలీవుడ్ లో ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.. పోకిరి సినిమాతో మొదలైన ఈ రిలీజ్ ట్రెండ్ స్టార్ హీరోల పుట్టినరోజు నాడు వారికి సంబంధించిన ఏవైనా పాత సినిమాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు నిర్మాతలు..ఇలా ఇప్పటివరకు పవన్, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి సినిమాలు విడుదలయ్యాయి.. ఈ కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది.


ఇప్పుడు అల్లు అర్జున్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా పేరు తెచ్చి పెట్టిన సినిమాలలో దేశముదురు కూడా ఒకటి.ఈ సినిమాని ఏప్రిల్ 8వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా రి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఏప్రిల్ ఏడవ తేదీన రవితేజ నటించిన రావణాసుర సినిమా విడుదల అవుతూ ఉండడంతో దేశముదురు సినిమా మీద ఆశించిన స్థాయిలో అసలు బజ్ క్రియేట్ కాలేదు..ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేసిన టికెట్లు మాత్రం అమ్ముడుపోవడం లేదట. అయితే రీ రిలీజ్ తర్వాత ఉన్న డిమాండ్ బట్టి ఇతర  ఎక్స్ట్రా షోలు యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే కేవలం మార్నింగ్ షో కి ఈ సినిమా ఉండకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. బజ్ లేనప్పుడు ఈ సినిమాని విడుదల చేయడం ప్రయోజనం ఉండదని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: