రెండు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు అత్యధిక షేర్ కలక్షన్ వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేశాయి. అందులో భాగంగా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మూవీ లు ఏవో తెలుసుకుందాం. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 31.63 కోట్ల కలెక్షన్ లను రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

ప్రభాస్ హీరోగా అనుష్క  తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ 14.80 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు రాబట్టింది. అల్లు అర్జున్ ... రష్మిక జోడిగా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.70 కోట్ల కనెక్షన్ లను వసూలు చేసింది. సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 అనే కన్నడ డబ్బింగ్ సినిమా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.37 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.14 కోట్ల షేర్ కలక్షన్ లను చేసింది. ఈ మూవీ లో నిత్య మీనన్ , సంయుక్తా మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాదే శ్యామ్ సినిమా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.34 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేర్ వీరయ్య 11.95 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. సర్కారు వారి పాట సినిమా 11.04 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. వకీల్ సాబ్ మూవీ 10.74 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. సాహో సినిమా 10.55 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: