బుక్ మై షో లో రికార్డు సృష్టించిన దసరా మూవీ..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో రూపొందే మూవీ లలో నటిస్తూ నటుడి గా తనను తాను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నాడు. నాని ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి నటుడి గా ఎన్నో సార్లు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ... అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే నటుడుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించిన నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని తన అద్భుతమైన ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఈ మూవీ.కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ వ్యయంతో నిర్మించాడుఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఈ మూవీ యూనిట్ ఓపెన్ చేసింది. ఈ మూవీ టికెట్ లకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో దసరా మూవీ 100 కే ఇంట్రెస్ట్ లని దక్కించుకుని నాని మూవీ లలో రికార్డు నెలకొల్పింది. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఓకే రోజు విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: