రికార్డ్ సృష్టించిన పర్జీ వెబ్ సిరీస్..!

Pulgam Srinivas
ది ఫ్యామిలీ మెన్ సీజన్ 1 మరియు సీజన్ 2 లకు దర్శకత్వం వహించి ఈ రెండు వెబ్ సిరీస్ లతో అద్భుతమైన క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న రాజ్ అండ్ డీకే ల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ది ఫ్యామిలీ మెన్ సిరీస్ లతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ఇద్దరు దర్శకులు తాజాగా ఫర్జీ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు.

ఈ వెబ్ సిరీస్ కొన్ని రోజుల క్రితం నుండే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే లు దర్శకత్వం వహించడం ... అలాగే ఈ వెబ్ సిరీస్ లో తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ సేతుపతి ఒక కీలకపాత్రలో నటించడం ... అలాగే హిందీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్నటువంటి షహీద్ కపూర్ నటించడం ... అలాగే రాశి కన్నా ఒక కీ రోల్ లో నటించడంతో ఈ వెబ్ సిరీస్ పై ఇండియా వ్యాప్తంగా విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో అదిరిపోయే రేంజ్ వ్యూస్ ఈ వెబ్ సిరీస్ కు లభిస్తున్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ వ్యూస్ పరంగా రికార్డును సృష్టించింది. ఇండియన్ "ఓ టి టి" వేదికల్లో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా ఫర్జి నిలిచింది. ఈ వెబ్ సిరీస్ 37 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు ఆర్మాక్స్ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీని తర్వాతి స్థానంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన రుద్ర మూవీ 35.2 మిలియన్ వ్యూస్ తో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: