"వినోదయ సీతం" రీమేక్ మూవీకి పవన్ ఎన్ని రోజుల కేటాయించాడో తెలుసా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం రీమిక్ మూవీ లపై ఆసక్తి చూపిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ తన కెరీర్ లో ఎన్నో రీమిక్ మూవీ లతో అద్భుతమైన సంచలనమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ "అజ్ఞాతవాసి" మూవీ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్ మూవీ తో తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ హిందీ సినిమా అయినటు వంటి పింక్ కి రీమేక్ గా రూపొందింది.

అలాగే ఆ తర్వాత పవన్ "భీమ్లా నాయక్" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అయ్యప్పనున్ కోషియన్ అనే మూవీ కు రీమేక్ గా రూపొందింది.  ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ "వినోదయ సీతం" అనే మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ భాగం నిన్ననే పూర్తయింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ మూవీ కోసం కేవలం 24 రోజులను మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది.

ఈ 24 రోజుల్లోనే పవన్ కు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని ఈ మూవీ యూనిట్ ముగించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని జూన్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: