మరో తమిళ దర్శకుడిని లైన్లో పెట్టిన షారుక్..?

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరోగా నటించిన షారుఖ్ ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు సినిమా లకు దూరంగా ఉన్న షారుక్ తాజాగా పఠాన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది . 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుఖ్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఓ తమిళ దర్శకుడు మూవీ లో హీరో గా నటిస్తున్న షారుఖ్ మరో తమిళ దర్శకుడి మూవీ లో కూడా నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొన సాగిస్తున్న లోకేష్ కనకరాజు దర్శకత్వం  లో షారుక్ ఒక మూవీ లో నటించే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం లోకేష్ కనకరాజు ... దళపతి విజయ్ హీరో గా పొందుతున్న లియో మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. లియో మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: