మరోసారి ఆ టాలీవుడ్ హీరోయిన్ తో నటించనున్న సల్మాన్..?

Pulgam Srinivas
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ లో సల్మాన్ ఖాన్ ఒక చిన్న పాత్రలో నటించాడు.

సల్మాన్ ఖాన్ పాత్ర ఈ మూవీ లో చాలా తక్కువ సమయమే ఉన్నప్పటికీ ఈ పాత్రతో సల్మాన్ ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. అలాగే ఈ సినిమా విజయంలో కూడా సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రను పోషించాడు. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ లలో బజరంగీ భాయిజాన్ సినిమా ఒకటి. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటు వంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని భారీ కలెక్షన్లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సీక్వల్ గా పవనపుత్ర అనే మూవీ ని నిర్మించనున్నట్లు సల్మాన్ ఖాన్ పోయిన సంవత్సరం ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే పవనపుత్ర పేరుతో తెరకెక్కబోయే సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే నటించబోతున్నట్లు ఒక వార్త బాలీవుడ్ వర్గాలలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ మరియు పూజా హెగ్డే లు "కిసీ కా భాయ్ ... కిసీ కీ జాన్" అనే మూవీ లో కలిసి నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: