అఖిల్ "ఏజెంట్" మూవీ సెకండ్ సాంగ్ విడుదలకు వేదిక ఖరారు..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ ఆఖరుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో పూజా హెగ్డే ... అఖిల్ కు జోడిగా నటించింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు.
 

ఈ సినిమాలో సాక్షి వైద్య ... అఖిల్ కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను ... ఒక పాటను మరియు టీజర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం "ఏందే ఏందే" అనే సెకండ్ సాంగ్ ను మార్చి 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ పాట విడుదలకు ఈ మూవీ బృందం వేదికను ఖరారు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లోని "ఏందే ఏందే" అనే సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు డాక్టర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ... వైజాగ్ లో విడుదల చేయనున్నట్టు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: