"ఖుషి" మూవీ ఓవర్సీస్ డీల్ పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత ... విజయ్ కి జోడి గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరూ కలిసి మహానటి మూవీ లో నటించారు. ఈ సినిమాలో వీరి జంటకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇలా ఇప్పటికే ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్న ఈ జంట ఖుషి సినిమాలో మరో సారి కలిసిన నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు  ఈ మూవీ యూనిట్ నిన్న అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డీల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను పర్స్ ఫిలిం సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ ని ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే విజయ్ "ఖుషి" మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: