బాబాయ్ హోటల్ ను గుర్తు చేసిన బ్రహ్మానందం !

Seetha Sailaja

వెన్నెల కిషోర్ జబర్దస్త్ కమెడియన్స్ హవా మొదలైన తరువాత కొన్ని సంవత్సరాలుగా చాలామంది బ్రహ్మానందం పేరు మర్చిపోయారు. బ్రహ్మీ సినిమాలలో చేసే కామెడీ రొటీన్ అయిపోవడంతో ఆయన కామెడీకి నేటితరం ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. అయినప్పటికీ కొన్ని సినిమాలలో ఆయన అతిధి పాత్రలలో కనిపించినప్పటికీ ఆపాత్రలు పెద్దగా క్లిక్ కాకపోవడంతో నేటితరం ప్రేక్షకులు బ్రహ్మానందాన్ని మరిచిపోయే స్థాయికి చేరిపోయారు.

ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా విడుదలైన ‘రంగమార్తాండ’ మూవీలో బ్రహ్మానందం నటన చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ఎప్పుడూ నవ్విస్తూ నటించే బ్రహ్మానందం ఈ స్థాయిలో ఒక సీరియస్ పాత్రను చేయడం చాలామందికి షాకింగ్ గా మారింది. వాస్తవానికి బ్రహ్మీ మంచి హాస్యనటుడు మాత్రమే కాదు మంచి నటుడు అన్నవిషయం అందరికీ తెలియచేయాలని 1992లో దర్శకుడు జంధ్యాల అతడిని హీరోగా చేసి నిర్మించిన ‘బాబాయ్ హోటల్’ మూవీ ఈనాతితరం ప్రేక్షకులకు తెలియదు.

ఆమూవీలో ఆయన చేసిన నటనకు అప్పట్లో అనేక అవార్డులు కూడ వచ్చాయి. వన్ సైడ్ లవ్ లో ప్రేమ విఫలమైనవాడిగా తాను దగ్గరుండి పెళ్లి చేసిన జంట యాక్సిడెంట్ లో చనిపోతే ఆబాధను దిగమింగుకుంటూ వారికి పుట్టిన పాపాని పెంచుకునే పాత్రలో జీవించాడని అప్పట్లో ప్రశంసలు వచ్చాయి. అంతకు ముందు సురేష్ కృష్ణ తీసిన ‘అమ్మ’ మూవీలో మిమిక్రి ఆర్టిస్టుగా బ్రహ్మీ అద్భుతంగా నటించాడు. లేటెస్ట్ గా విదుదలై కృష్ణవంశీ ‘రంగమార్తండ’ మూవీలో చక్రపాణి పాత్రను బ్రహ్మానందం అద్భుతంగా పోషించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.

ముఖ్యంగా ఈమూవీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ ని డామినేట్ చేసే స్థాయిలో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు పలికిన సంబాషణలు బ్రహ్మానందం స్థాయిని మరొకసారి రుజువు చేసాయి. ఈసినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఉగాది రోజున కూడ ఈమూవీకి సరైన కలెక్షన్స్ రాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈమూవీ చాల స్లోగా ఉండటంతో సగటు ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ కాలేకపోతున్నాడు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: