నాగశౌర్య కొత్త మూవీకి వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో నాగ శౌర్య వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించిన నాగ శౌర్య చాలా సంవత్సరాల క్రితం ఛలో మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించిన నాగ శౌర్య కు కొన్ని మూవీ ల ద్వారా మంచి విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి.
 

కాకపోతే ఆ మూవీ లు ఛలో మూవీ రేంజ్ విజయాలను మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకో లేక పోయాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం నాగ శౌర్య ... అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇలా ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ యువ హీరో తాజాగా తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశాడు.

అలాగే తన తదుపరి మూవీ కి సంబంధించిన టైటిల్ ను కూడా ప్రకటించాడు. నాగ శౌర్య తన కొత్త మూవీ ని కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి తో చేయనున్నాడు. యుక్తి తరేజా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తున్న ఈ మూవీ కి పవన్ సిహెచ్ సంగీతం అందించనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసింది. ఈ మూవీ కి ఈ చిత్ర బృందం "రంగబలి" అనే టైటిల్‌ ను ఖరారు ఖరారు చేసింది. ఇలా నాగ శౌర్య తదుపరి మూవీ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: