శ్రీ విష్ణు "సామజవరగమన" సినిమా విడుదల తేదీని ప్రకటించడం మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్న శ్రీ విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు.
 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన ఈ నటుడు ఇప్పటికే మెంటల్ మదిలో ... బ్రోచేవారెవరురా ... రాజ రాజ చోరా మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ హీరో ఆఖరుగా అల్లూరి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఇలా అల్లూరి సినిమాతో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన శ్రీ విష్ణు ప్రస్తుతం సామజవరగమన అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ మూవీ యూనిటీ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేసింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ మూవీ లో ముఖ్యపాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: