"ఓటిటి" లో కూడా జోరును చూపిస్తున్న "పఠాన్" మూవీ..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన పఠాన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ దర్శకుడు ఈ సినిమాని హై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఈ మూవీ లో షారుక్ సరసన అందాల ముద్దు గుమ్మ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు.

ఈ సినిమా విడుదలకు ముందు నుండే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మార్చి 22 వ తేదీ నుండి ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో హిందీ , తెలుగు , తమిళ భాషల్లో అందుబాటు లోకి వచ్చింది.

ఇలా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. థియేటర్ లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా తన జోష్ ను చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: