మెగా హీరో మూవీ టీం పై అసంతృప్తి చెందిన క్రేజీ హీరోయిన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి అందులో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సాయి తేజ్ ప్రస్తుతం విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై ప్రస్తుతం తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ లో సాయి తేజ్ కు జోడిగా సంయుక్తా మీనన్ నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా చాలా జోరుగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం పై ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంయుక్తా మీనన్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేసింది.

 సోషల్ మీడియా వేదికగా సంయుక్త మీనన్ ... విరూపాక్ష మూవీ బృందం తో పని చేస్తుండడం చాలా ఆనందంగా అనిపించిందని ... అయితే ఉగాది సందర్భంగా సినిమా బృందం నుండి నా పాత్ర కి సంబంధించి స్పెషల్ పోస్టర్ వస్తుందని ఆశించాను కానీ రాలేదు అని ... దీనితో ఎంతో నిరత్సాహానికి గురయ్యాను అంటూ సంయుక్త సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర టీమ్ ... క్షమించాలి మాకు కొద్దిగా సమయం ఇవ్వండి తప్పకుండా పోస్టర్ రిలీజ్ ఉంటుందని సంయుక్త పోస్ట్ కు రిప్లై ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: