ఆ భాషలో కూడా ప్రభాస్ "సలార్" మూవీ విడుదల..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమా లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ క్రేజీయేస్ట్ ప్రాజెక్ట్ లలో సలార్ మూవీ ఒకటి. ఈ మూవీ లో ప్రభాస్ హీరోcగా నటిస్తూ ఉండగా ... ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై దేశcవ్యాప్తంగా ఇప్పటికే సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి.

ఇలా భారీగా అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా అవి ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లో శృతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ... జగపతి బాబు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. రవి బుస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈ భాషలతో పాటు సలార్ మూవీ ని ఇంగ్లీష్ భాషలో కూడా థియేటర్ లలో విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు ఈ మూవీ కి 200 కోట్ల  ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: