"పఠాన్" అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా పఠాన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు.
 

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన హిందీ , తెలుగు , తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: