సూపర్ స్టార్ మహేష్ సినిమాలో బాలీవుడ్ భామ...!!

murali krishna
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు. మహేష్ బాబు గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో థియేటర్స్ లో సందడి చేసాడు.ఈ సినిమాతో మహేష్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా కూడా ఇంకా మరో సినిమా షూట్ సగం కూడా పూర్తి చేయలేదు.
సంక్రాంతి తర్వాత త్రివిక్రమ్ తో చేస్తున్న షూట్ స్టార్ట్ అయ్యింది. గత నెలన్నరగా షూట్ శరవేగంగా జరుగుతుంది. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోను కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ ఎంపిక చేసారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏ బాలీవుడ్ హీరోను ఎంపిక చేసారో ఇంకా తెలియలేదు.
అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో కథానుసారంగా వచ్చే ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేశారట.ఈ స్పెషల్ సాంగ్ కథానుసారంగా ఉండబోతుందట.ఇందుకోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలాను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈసారి త్రివిక్రమ్ అదిరిపోయే సాంగ్ ను అయితే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.. అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు.దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో జగపతిబాబు కూడా కీ రోల్ లో నటిస్తున్నాడు.పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆగస్టు నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఐతే ఈ సినిమా హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు భావిస్తున్నారు. దీని తర్వాత మహేష్ -రాజమౌళి కాంబో పట్టాలెక్కబోతుంది అన్నా సంగతి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: