అనుపమ కూడా ఆ పని మొదలేట్టేసిందిగా..!!
అయితే ఇప్పుడు తాజాగా ఏకంగా లైకా ప్రొడక్షన్ తో కూడా ఈ ముద్దుగుమ్మ లేడి ఓరియంటెడ్ చిత్రాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనుపమతో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతోందట. ఈనెల 13వన చెన్నైలో ఈ సినిమా అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. దీంతో అనుపమ రేంజ్ మరింత రెట్టింపు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించింది. ఉత్తరాది రాష్ట్రాలలో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్రేజ్ ని క్యాష్ చేసుకొనే లైకా సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ ఎవరు ఇతర నటీనటులు ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా తో అనుపమ ఆనందానికి అవధులు లేవంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లైకా సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా సమస్త కాబట్టి ఈ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా పేరు వస్తుంది అలాగే పాపులర్ అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం కోలీవుడ్ లో జయం రవి సరసన సైరన్ అనే చిత్రంలో అనుపమ నటిస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం అనుపమకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.