కృతి సనన్ ను ప్రశ్నించిన ప్రభాస్ !

Seetha Sailaja
ప్రభాస్ వయసు 44 సంవత్సరాలు దాటిపోవడంతో అతడు కనిపిస్తే చాలు చాలామంది అతడి పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉంటారు. కొన్నాళ్ళు అనుష్క ను ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ గాసిప్పులు తగ్గిపోయిన తరువాత ఇప్పుడు ఈ లిస్టులోకి బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ వచ్చి చేరింది.

ఆమె ప్రభాస్ ప్రేమించు కుంటున్నారని త్వరలో పెళ్ళి కూడ చేసుకుంటారని అనేక ఊహాగానాలు వచ్చాయి. ఇలాంటి ఊహాగానాలు రావడానికి స్పష్టమైన ఒక కారణం కూడ కనిపిస్తోంది. ఆమధ్య ఒక టీవీ షోలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ను కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేస్తూ నిన్ను పెళ్ళి చేసుకునే వారి లిస్టులో కృతి పేరు ఎందుకు మిస్ అయింది అంటూ కరణ్ అడగడంతో ‘‘ఆమె వేరే హృదయంలో ఉంది’’ అని వరుణ్ ధావన్ చెపుతూ ముంబాయిలో ఆవ్యక్తి లేదని ప్రస్తుతం అతడు దీపికా పదుకొనె తో షూటింగ్ లో చాల బిజీగా హైదరాబాద్ లో ఉన్నాడు అని చెప్పడంతో అతడు ప్రభాస్ అంటూ రూమర్లు పుట్టుకు వచ్చాయి.

అయితే రూమర్స్ పై ప్రభాస్ కానీ కృతి కానీ ఖండన ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య ఎదో జరుగుతోంది అంటూ మరికొందరు మరిన్ని ఊహాగానాలు సృష్టించారు. ఈవిషయం పై కృతి లేటెస్ట్ గా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసింది. ఈమధ్య తనకు ప్రభాస్ ఫోన్ చేసి ‘పెళ్ళి ఎప్పుడు చేసుకుందాము’ అంటూ ప్రశ్నించిన విషయాన్ని బయటపెట్టింది.

ఆ ప్రశ్నకు తాను షాక్ అయిన విషయాన్ని తెలియ చేస్తూ ఈ రూమర్లను ఖండించాలని తనకు అనిపించడంతో ఇప్పుడు తాను ఈవిషయం పై క్లారిటీ ఇచ్చింది. తనకు ప్రభాస్ మంచి స్నేహితుడు మాత్రమే అనీ తనకు కానీ ప్రభాస్ కు కానీ పెళ్ళి చేసుకునే ఆలోచనలు లేవు అంటూ ప్రస్తుతం తన కెరియర్ గురించి మాత్రమే తన ఆలోచనలు అంటూ క్లారిటీ ఇచ్చింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: