సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. నిజానికి చాలామంది అగ్ర దర్శకులు తమకు కంఫర్ట్ ఉన్న వారితోనే పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి డాన్స్ మాస్టర్స్ వరకు తమకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. ఇందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఆతీతమేం కాదు. ఈయన చాలా వరకు తనకు కంఫర్ట్ ఉన్న వారిని రిపీట్ చేస్తుంటాడు. గతంలో తన ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ ని తీసుకునేవాడు త్రివిక్రమ్. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం దేవిశ్రీప్రసాద్ ని దూరం పెట్టేసాడు. ఈ క్రమంలోనే అజ్ఞాతవాసి సినిమాకి అనిరుధ్ ని.. అలవైకుంఠపురంలో సినిమాకి తమన్ ని..
అలాగే అరవింద సమేత సినిమా కూడా తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా తమనే. మ్యూజిక్ డైరెక్టర్ అయితే త్రివిక్రమ్ కి ఎంతో కలిసొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని దూరం పెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయట. గతంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ మ్యూజిక్ ఇవ్వడంలో అలాగే ఆర్ఆర్ సమయంలో దేవిశ్రీప్రసాద్,త్రివిక్రమ్ కి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయట. ఇద్దరు కూడా ఈగో లకు చిన్న గొడవ కాస్త పెద్దగా మారింది. అప్పుడు అల్లు అరవింద్ ఇద్దరి మధ్య గొడవ సర్దుమనిగేలా చేసి ఆ మూవీని కంప్లీట్ అయ్యేలా చూసాడు.
అయితే ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ ని పూర్తిగా పక్కన పెట్టేసాడు. గత కొంతకాలంగా దేవి శ్రీ ప్రసాద్ కూడా అతని రేంజ్ కి తగ్గ మ్యూజిక్ను ఇవ్వలేకపోతున్నాడు. గత ఏడాది పుష్ప సినిమాతో మ్యూజిక్ విషయంలో దేవిశ్రీప్రసాద్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పాలి. ప్రస్తుతం పుష్ప2 కోసం పనిచేస్తున్నాడు దేవిశ్రీప్రసాద్. అయితే ఇప్పటికి చాలామంది ఆడియన్స్ త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ కోరుకుంటున్నారు. అయితే వీళ్ళ కాంబినేషన్ వచ్చి చాలా కాలం కావడంతో భవిష్యత్తులో కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!