తారకరత్న పెద్దకర్మ తేదీ ఖరారు..!

Divya
నందమూరి తారకరత్న మరణ వార్త ఒక్క వారి కుటుంబాన్నే కాదు యావత్ సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. కేవలం 39 సంవత్సరాల వయసులోని ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నాయకుడు తారకరత్న గుండెపోటుతో మరణించడం నిజంగా విషాదకరం. దాదాపు 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఈనెల 18వ తేదీన తారకరత్న కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు నందమూరి అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు..
ఇకపోతే తారకరత్న మరణాంతరం చేయాల్సిన అన్ని కార్యక్రమాలను బాలకృష్ణ,  విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.  ఇప్పటికే అంత్యక్రియల తర్వాత చిన్న కర్మను ఏర్పాటు చేయగా నందమూరి నారా కుటుంబ సభ్యులు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి కూడా ఘటించారు. ఇప్పుడు పెద్దకర్మ తేదీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. నందమూరి తారకరత్న తరపున బాలకృష్ణ, ఆయన భార్య అలేఖ్య రెడ్డి తరఫున విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమం ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరియు చూసుకుంటూ ఉండడం గమనార్హం.
ఇకపోతే తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటినుంచి అంత్యక్రియలు ముగిసే అంతవరకు అన్నీ కూడా బాలకృష్ణ దగ్గరుండి చూసుకున్నారు.  ఇప్పుడు హీరో కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి పెద్దకర్మ తేదీని కూడా ఫిక్స్ చేశారు.మార్చి 2వ తేదీ గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్దకర్మ నిర్వహిస్తున్నామని ఒక కార్డులో ప్రచురించారు.. కార్డుపై వెల్ విషెస్ గా విజయసాయిరెడ్డి, బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీటితోపాటు అలేఖ్య రెడ్డి వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్ పేర్లు కూడా పత్రికలో ప్రచురించడం జరిగింది.  ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనవి కూడా చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: