సూపర్ స్టార్ షాకింగ్ రెమ్యునరేషన్.. 7 రోజులకే అన్ని కోట్లా..?

Anilkumar
సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడు పదుల వయసు దాటిన ఆయన పాపులారిటీ ఏమాత్రం తగ్గడం లేదు. రజనీకాంత్ తెరపై కనిపిస్తే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురవాల్సిందే. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు భారీ కలెక్షన్స్ ని సాధిస్తుంటాయి. ఆ స్థాయిలో ఆయన సినిమాలు ఉంటాయి కాబట్టే రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటాడు ఈ కోలీవుడ్ సీనియర్ హీరో. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. 

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. వేసవి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు లాల్ సలాం అనే మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా కాకుండా గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు రజనీకాంత్. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే లాల్ సలాం సినిమా కోసం రజనీకాంత్ కేవలం వారం రోజుల డేట్స్ కేటాయించారట. అయితే ఈ వారం రోజులకు గాను ఆయన భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

కేవలం వారం రోజులకు గాను ఏకంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ ను రజనీకాంత్ తీసుకుంటున్నారు. ఇందుకు లైకా ప్రొడక్షన్స్ వారితో డీల్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ లోకి రజనీకాంత్ సైతం ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఏడు రోజులకే 25 కోట్లు రజనీకాంత్ రెమ్యునరేషన్ గా తీసుకుంటుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా జైలర్ సినిమా కోసం కూడా రజనీకాంత్ భారీ మొత్తంలోనే డిమాండ్ చేశాడట. జైలర్ కోసం ఏకంగా 140 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరోల అందరిలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రజనీకాంత్ మొదటి స్థానంలో ఉంటూ సరికొత్త రికార్డును నెలకొల్పారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: