వెనకడుగు వేసిన కిరణ్ అబ్బవరం..!!

Divya
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాని ఈనెల 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అయితే విడుదలకు వారం రోజుల ముందు ఒకరోజు ఆలస్యం అన్నట్లుగా చిత్ర బృందం ఇటీవల ప్రకటించడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గీత ఆర్ట్స్-2 బ్యానర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అల్లు అరవింద్ సినిమాల నిర్మాణ విషయం లో చాలా ప్లాన్ గా ఉంటారని చెప్పవచ్చు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణంలోకి తీసుకొని విడుదల చేస్తూ ఉంటారు.

చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే భారీగానే ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు.ఈ సినిమా యొక్క నెంబర్ సైబర్ కాన్సెప్ట్ తో ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ట్రెజర్  బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో  విడుదల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.అందుచేతనే ఫిబ్రవరి 17వ తారీఖున రాబోతున్న సార్ సినిమాకు పోటీ లేకుండా ఒకరోజు ఆలస్యంగా వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తున్నది.

ధనుష్ సినిమా అయితే అయినప్పటికీ సితార వారు భారీ ఎత్తున ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తు న్నారు. ఒక తెలుగు సినిమా అన్నట్లుగా హడావుడి చేస్తూ ఉండడం తో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి రాబోతున్న సినిమా అవ్వడంతో ఇతర విషయాలు ఏమి పట్టించుకోకుండా ప్రేక్షకులు కూడా ఎక్కువ శాతం వెళ్లి థియేటర్లకు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారైనా కిరణ్ అబ్బవరం కు సరైన సక్సెస్ అందిస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా అల్లు అరవింద్ ఒక ప్లాన్ తోనే సినిమాలను విడుదల చేస్తూ ఉంటారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: