బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఖాన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుమారు నాలుగు సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో ఎట్టకేలకు తాజాగా 'పఠాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా పఠాన్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతోంది. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 మూవీస్ లిస్ట్ లో చేరింది పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కలెక్షన్స్ లో ఈ సినిమా 1000 కోట్లకు చేరువలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు షారుక్ ఖాన్. ఈ సందర్భంగా ఆయన ఈ ఈవెంట్ లో ఓ బ్లూ కలర్ వాచ్ ని ధరించారు. బ్లాక్ సూట్ వేసుకున్న షారుక్ ఖాన్ చేతికి ఆ బ్లూ కలర్ వాచ్ మరింత స్పెషల్ గా కనిపించింది. దీంతో తాజాగా షారుక్ ఖాన్ ధరించిన ఆ వాచ్ ధర తెలుసుకొని నెటిజెన్స్, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ధరించిన ఆ వాచ్ ధర కొన్ని కోట్లల్లో ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ వాచ్ ధర ఎంత అంటే అక్షరాల 4 కోట్ల 98 లక్షలు అని తెలుస్తోంది. అభిమానులు ఇప్పటికే షారుక్ ధరించిన ఆ వాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
అందులో భాగంగానే ఈ వాచ్ గురించి ఫ్యాషన్ బ్లాగింగ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ డైట్ సబ్యా ని అడిగగా..ఆ వాచ్ 'Audemars Piguet' నుండి వచ్చిందని వెల్లడించారు. ఇక డైట్ సబ్యా వారి వివరాల ప్రకారం.. ఈ వాచ్ రాయల్ ఓక్ కు సంబంధించిన పెర్పేతుల్ క్యాలెండర్ వాచ్. దీని విలువ 4.98 కోట్లు.. Chrono 24 వెబ్సైట్ ప్రకారం ఇది 4.7 కోట్లకు ప్రస్తుతం అమ్ముడు అవుతుంది. ఇక ప్రస్తుతం షారుక్ ధరించిన ఈ వాచ్ సోషల్ మీడియా అంతట తెగ ట్రెండ్ అవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ బాలీవుడ్ బాద్షా దగ్గర ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ముంబైలో సముద్రానికి ఎదురుగా ఉన్న బంగ్లా మన్నత్. దీని విలువ సుమారు 200 కోట్లు ఉంటుంది. దీంతోపాటు ఢిల్లీలోని ఆయనకు ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. అటు బీఎండబ్ల్యూ 6 సిరీస్, బిఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి తో పాటు ఇతర కార్లు కూడా ఉన్నాయి...!!