3 కోట్ల కోసం సినిమాల్లో అలాంటి పనులు చేస్తున్న సీతారామం హీరోయిన్..?

Anilkumar
సినీ  ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది మృణాల్ ఠాగూర్. మహారాష్ట్రలో జన్మించిన ఈమె సీరియల్స్ ద్వారా మొదట తన కెరీర్ను ప్రారంభించింది.దాని అనంతరం బాలీవుడ్లో అడపా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ కొన్ని సినిమాలలో నటించి నటిగా పేరును తెచ్చుకుంది. అయితే ఈమె దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మరియు హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో హీరోయిన్గా నటించింది ఈమె. ఇక ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె..

 ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి ఎందరో ప్రేక్షక అభిమానుల ప్రశంసలను పొందింది. అంతే కాదు ఈమెకి యూత్లో ఈ సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం ఆచితూచి సినిమా లో చేస్తోంది. అయితే తాజాగా ఒక స్టార్ హీరో సినిమాలో మొదటిసారిగా ఐటెం సాంగ్ లో నటించేందుకు రెడీ అయ్యింది ఈమె. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సెల్ఫీ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా అని తీస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు ఇమ్రాన్ హష్మీ కూడా కనిపించనున్నాడు.

అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాలో కుడియేని తిరి అనే ఒక స్పెషల్ సాంగ్లో నటించింది  మృనాళ్ ఠాగూర్. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు రావడం జరిగింది. ఇక ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో చూసిన చాలా మంది ఠాగూర్ బరితెగించింది అంటూ రకరకాల కామెంట్లను చేస్తున్నారు. అంతేకాదు ఈ సాంగ్ కోసం మృణాల్ ఠాగూర్ ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొందట. అంతేకాదు మూడు కోట్ల కోసం ఐటమ్ సాంగ్ లో చేస్తావా అంటూ అసభ్యకరమైన కామెంట్లను చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి ఐటెం సాంగ్స్ లో చేస్తే స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు తగ్గిపోతాయి అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: