పవన్ అభిమానులూ.. రెడీగా ఉండండమ్మా.. పవన్ పండగ షురూ..!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలు ఇలా రెండు పడవలపై ఏకకాలంలో ప్రయాణం చేస్తున్నాడు. వరుస సినిమాలు లైన్ లో పెడుతూ వచ్చిన డబ్బులను పార్టీ కోసం ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు వినోదయ సీతం అలాగే తాజాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని సాహో డైరెక్టర్ సుజిత్ తో ఓజీ పేరుతో మరొక సినిమాను ఇలా వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు వీటికి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నెలకొకటి చొప్పున కంప్లీట్ చేస్తూ అభిమానులకు పండుగ వాతావరణాన్ని కలుగజేస్తున్నారు.
తాజాగా జనవరి చివరి వారంలో పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓ జి సినిమా పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా పూర్తి చేశారు.  ఈ పూజా కార్యక్రమాలకు దగ్గుబాటి సురేష్ బాబు,  అల్లు అరవింద్,  దిల్ రాజు తదితరులు పాల్గొని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది.. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమాలు నెలకొకటి చొప్పున పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అభిమానులకు పవన్ పేరిట పండుగ వాతావరణం నెలకొల్పుతున్నారు అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా వినోదయా సీతం తెలుగు రీమేక్ పూజా కార్యక్రమం ఫిబ్రవరి 14వ తేదీన జరగబోతున్న విషయం తెలిసిందే.  మరొక నెల మరో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ యొక్క పూజా కార్యక్రమం కూడా జరగబోతోంది.. ఇదివరకే జనవరిలో ఓజీ పూజా కార్యక్రమాలు నిర్వహించగా డిసెంబర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.. దీన్ని బట్టి చూస్తుంటే నెలవారీ ప్రాతిపదికగా పవన్ కళ్యాణ్ సినిమా ప్రాజెక్టుల పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: