బాలయ్యకు షాక్ ఇచ్చి.. అక్కడ ప్రత్యక్షమైన చిరంజీవి?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  మొదటి సీజనే సూపర్ హిట్ అయింది అనుకుంటే ఇక రెండవ సీజన్ అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రస్తుతం రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. అయితే ఎక్కువగా టాక్ షోలలో కనిపించని గెస్టులను  తన షోకి పిలిచి వారిని ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ తన షో ఇక అందరి హీరోల అభిమానులకు చేరేలా చేసుకుంటున్నాడు బాలకృష్ణ.

 ఇక మొన్నటికి మొన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చి అభిమానులందరినీ కూడా ఉర్రూతలూగించాడు. అయితే ఇటీవలే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అన్ స్టాపబుల్  కార్యక్రమంలో సందడి చేయడంతో ఇక ఈ షో రేటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏకంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్  షోకి షాక్ ఇచ్చి ఇక ఇప్పుడు మరోచోట ప్రత్యక్షమయ్యాడు అన్నది తెలుస్తుంది.  అన్ స్టాపబుల్ రెండవ సీజన్ ప్రారంభమైన తర్వాత మెగాస్టార్ గెస్ట్ గా రాబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అది నిజం కాలేదు.

 ఇన్ని రోజుల వరకు బాలయ్య కార్యక్రమానికి దూరంగా ఉన్నా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సింగర్ స్మిత నిర్వహించబోతున్న నిజం విత్ స్మిత అనే టాక్ షోలో మాత్రం పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇటీవల మెగాస్టార్ కు సంబంధించిన ప్రోమో ని కూడా విడుదలైంది. ఓటిటి సంస్థ సోనీ లీవ్ లో ఇక ఈ షో ప్రసారం కాబోతుంది అని చెప్పాలి. అయితే స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరంజీవి అన్ స్టాపబుల్ కి మాత్రం ఎందుకు రావడం లేదు అనే చర్చ మొదలైంది అని చెప్పాలి. అయితే సీజన్ 2 లో మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఛాన్స్ లేదని.. ఇక సీజన్ 3 లో మాత్రం చిరంజీవి వచ్చే అవకాశం ఉంది అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: