మెగాస్టారా మజాకా.. సినిమా తీసింది 29 రోజులు.. కానీ ఆడింది 512 రోజులు..!!

Anilkumar
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఎంతోమంది నటీనటులకు చిరంజీవి గారే స్ఫూర్తి. మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన స్వయంకృషితో మెగాస్టార్ రేంజ్ కి వెళ్లారు. చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే ఆరోజు అభిమానులకు పండగే. ఇక ఆయన సినిమాకు కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. మాస్, యాక్షన్ సినిమాలే కాదు కామెడీ ఓరియంటెడ్ ప్రయోగాత్మక చిత్రాల్లోనూ మెగాస్టార్ స్టైల్ ప్రత్యేకమని చెప్పాలి. అయితే ఆయన కెరియర్ మొదట్లో నటించిన ఓ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ సినిమా తీయడానికి కేవలం నెల రోజుల సమయం కూడా పట్టలేదు.

కానీ ఆ సినిమా ఏకంగా 500 రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఫలితంగా మెగాస్టార్ కెరియర్ లోనే అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఆ సినిమానే 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'. 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మాధవి జంటగా నటించారు. ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను కే రాఘవ నిర్మించారు. ఇక దర్శకుడిగా కోడి రామకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ఇదే. 1982 ఏప్రిల్ 22న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఏకంగా 512 రోజులు ఆడి అప్పట్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

కేవలం 29 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ని కంప్లీట్ చేశారట. విడుదలైన మొదట్లో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మెల్లమెల్లగా సూపర్ హిట్ టాక్ ని ఆ అందుకొని కలెక్షన్ల  వర్షం కురిపించింది. కేవలం 3 లక్షల 25 వేల రూపాయలతో ఈ సినిమాని తీశారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, సఖినేటిపల్లి, మద్రాస్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ని నిర్వహించారు. అలా తక్కువ లొకేషన్స్ లో షూటింగ్ చేసిన ఈ మూవీ విడుదలైన తర్వాత ఏకంగా ఎనిమిది కేంద్రాల్లో 50 రోజులు రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడి భారీ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే హైదరాబాద్లో ఏకంగా 512 రోజులు ఆడిందంటే అది మామూలు విషయం కాదు. అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కే కాదు దర్శకుడిగా కోడి రామకృష్ణ గారికి కూడా ఈ సినిమా మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: