సలార్: గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ అప్పుడే?

Purushottham Vinay
బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో ఒక్కసారిగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. బాహుబలి తరువాత వరుసగా భారీ ఫ్లాప్ లు వస్తున్న డార్లింగ్ క్రేజ్ మాత్రం అసలు కొంచెం కూడా తగ్గట్లేదు. రోజురోజుకు డార్లింగ్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఇక ఆయన్ను త్వరలోనే బాహుబలి రేంజిలో వెండి తెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఆరాటపడుతున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న  చిత్రాల్లో అభిమానులను ఆసక్తి రేకిస్తున్న సినిమాలలో సలార్ ఒకటి. ఈ సినిమా గురించి అభిమానులకు ఓ చక్కటి శుభవార్త బయటకు వచ్చింది.బ్లాక్ బస్టర్ kgf సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం  ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్  గురించి అప్డేట్ వచ్చింది.


అదేంటంటే.. ఏప్రిల్ 2 వ తేదీన టీజర్ ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.అతి త్వరలోనే దీనిపై అధికార ప్రకటన కూడా రానుంది. ఇకపోతే యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ భయంకరమైన విలన్ గా కనిపించనున్నారు. సలార్ సినిమాలో ఆద్య అనే జర్నలిస్ట్ పాత్రలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.కేజీఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ ఏకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో సలార్ సినిమాను నిర్మించి చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో రాకింగ్ స్టార్ యశ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. యష్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: